9, సెప్టెంబర్ 2010, గురువారం

"కుల" గణన......!

గత కొద్ది నెలలుగా కుల గణన జరపాలా వద్దా అని జరుగుతున్న వాదనలకు తెరపడింది.కేంద్ర మంత్రి వర్గం కులాల వారీగా జన గణనకు ఆమోదం తెలిపింది.దీని ద్వారా 2011 లో జరగబోతున్న జనాబా గణనలో కులాన్ని కూడా చేర్చబోతున్నారు.1931 లో దేశంలో కుల గణన జరిగింది .ఎనబైఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది.దీని ద్వారా దేశంలోని ఆరువేల కులాలు అరవైఐదు వేల ఉపకులాలు సాధికారంగా పరిగణలోకి వస్తాయి.


ఇప్పుడిప్పుడే కులగజ్జి నుండి బయటపడుతున్న ప్రజలకి బాబు నీ కులం ఇది మర్చిపోకు అని గుర్తుచేయబోతున్నాయి ఈ లెక్కలు.నెమ్మదిగా వ్యాపిస్తున్న ప్రాంతీయతత్వం,మతతత్వాలకు తోడుగా మెల్లగా చాపకింద నీరులా కులతత్వాన్ని కూడా చేరుస్తున్నారు మన నాయకులు.appsc లాంటి సంస్థల్లో ప్రాంతాల వారీగా రిజర్వేషన్ల కోసం జరుతున్న ఉద్యమాలు.ఇక నుండి "మా కులం జనాభా ఇంతమంది ఉన్నా ఉన్న ఉద్యోగాలు కొన్నే కాబట్టి upsc ,appsc లాంటి సంస్టలలో మా కులానికి రిజర్వేషను కావాలని" అరవై ఐదు వేల కులాల వారు ఉద్యమాలు నడపబోతున్నారు.మన రాజకీయ నాయకులకు మాత్రం ఇది ఎంతో ఉపయోగకరం."విభజించి పాలించు" అనే బ్రిటీషు వారి సూత్రాన్ని వంటబట్టించుకున్న మన నాయకులకు ముఖ్యంగా అత్యంత హేయమైన కుల రాజకీయాలకు ఆదర్శాలుగా ఉన్న ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్,మాయావతి లాంటి వారికి ఎంతో అవసరం.ఇక ఇంకో విషయం .జనాబా గణనలో వారు చెప్పేవాటి విశ్వసనీయత నిర్ణయించాల్సిన బాద్యత ఎన్యుమరేటర్లదేనట అవి ఎంత హేతుబద్దంగా ఉంటాయో అనుమానమే.తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి జరిమానా వెయ్యి రూపాయలట.ఇకనుండి తప్పు కులంతో ఎన్నికలలో పోటి చేసిన నాయకుల,ఉద్యోగాలలో చేరిన వారి కేసులు లక్షల్లో కోర్టుల్లోకి రాబోతున్నాయి.అంటే తప్పుడు కులం తో ఉద్యోగం లో చేరి పది,పదిహేను తర్వాత ఆ విషయం బయట పడితే కోర్టులో వెయ్యి రూపాయలు జరిమానా కట్టి దర్జాగా తిరగోచ్చన్నమాట.

దేశంలోని మేధావులంతా వద్దుమోర్రో అని గగ్గోలు పెడుతున్నా కుల గణనని ఆమోదిచడం ద్వారా మన దేశంలో తమ పబ్బం గడుపుకోవటానికి రాజకీయ నాయకులు ఎంతకైనా దిగాజారుతారని మరోసారి రుజువు చేసుకున్నారు.

8, సెప్టెంబర్ 2010, బుధవారం

శ్రీ కృష్ణ కమిటీ ఏంచెప్పబోతుంది........!

శ్రీకృష్ణ కమిటీ సభ్యకార్యదర్శి దుగ్గల్‌ గారు నిన్న విలేకరులతో మాట్లాడుతూ." ప్రజలకు ఏది ఉపయోగం, ఏది హేతుబద్ధం, అత్యధిక ప్రజావాంఛ ఏమిటి, ప్రజాప్రయోజనాలకు ఏది ముఖ్యం అన్న విషయాలు మా నివేదికలో పొందుపరుస్తాం. కార్యాచరణ 'ఎ' అవసరమైతే ఎలా ఉండాలి, కార్యాచరణ 'బి' అయితే ఎలా ఉండాలో చెబుతాం. నిర్ణయాధికారం మాత్రం ప్రభుత్వానిదే"అని అన్నారు .దీనిని భట్టి శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఏవిధంగా ఉండబోతుందో మనం ఉహించవచ్చు..


ఒకవేళ వారు అన్నట్టు కార్యాచరణ 'ఎ' అంటే విభజన జరిగే పక్షం లో .ఆంద్రా ప్రాంతం వారు ముఖ్యం గా ఆందోళన చెందుతున్న రాజదాని హైదరాబాద్ గురించి నీటి పంపిణి గురించి సూచనలు చేయొచ్చు.అవి ఒకటి హైదరాబాదును కేంద్రపాలిత౦గా చేయటం.రెండు హైదరాబాదును ఉమ్మడి రాజదానిగా చేయటం. మూడు ఆంధ్రా వారు కొత్త రాజదానిని ఏర్పరుచుకోవటానికి తగిన నిధులు కేంద్రం సమకూర్చాలని సలహా ఇవ్వటం.ఇక నీటి వనరుల పంపిణీ విషయంలో ఇరు ప్రాంతాల వారి మధ్య ఒక ఒప్పందం తయారు చేయొచ్చు.


ఇక కార్యాచరణ 'బి' అంటే విభజన జరగని పక్షంలో .ఈ సూచనలు చేయొచ్చు.ప్రత్యేక మండలి ఏర్పరచి తెలంగాణా అభివృద్దికి నిధులు కేటాయించటం.తెలంగాణా వారికి రాజకీయ పదవుల పంపిణి.ఇంతకు ముందు ఉన్న" పెద్దమనుషుల ఒప్పందం" తరహాలో మరొక ఒప్పందాన్ని ఏర్పాటు చేసి.దాన్ని కచ్చితంగా అమలు పరిచే విదంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పరిచి దానికి చట్టభద్రత కల్పించటం ఈ విధంగా ఉండవచ్చు .కాని ఇంతకూ ముందు జరిగిన పెద్దమనుషుల ఒప్పందంలోనే మోసపోయామని భావిస్తున్న తెలంగాణా ప్రాంతం వారిని రాజదాని విషయంలో పట్టు పడుతున్న ఆంధ్రా ప్రాంతం వారిని ఎలా ఒప్పించగలరనేది ప్రశ్నార్ధకమే.నివేదిక అందిన తరువాత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది కత్తి మీద సాము లాంటిదే.

సుప్రీంకు ప్రధాని సలహ....!

"విధానాలు రూపొందించే పరిధి శాసన వ్యవస్థకు సంబంధించింది.అందులో న్యాయస్థానాలు ప్రవేశించరాదు".ఆహార దాన్యాలను వృదాగా గోదాములలో మక్కబెట్టేబదులు పేదలకు పంచమని ఆదేశించిన సుప్రీం కోర్టుకు మన ప్రదానిగారు ఇచ్చిన సలహా ఇది.

ప్రదానిగారు విధానపర నిర్ణయాలు తీసుకొనే పని శాసన వ్యవస్థదే .కానీ ఆ శాసన వ్యవస్త నిర్వీర్యం అవుతున్నప్పుడు.న్యాయవ్యవస్థ కలుగజేసుకోవటం తప్పుకాదేమో.దేశంలో 37 శాతం (మీ లెక్కల ప్రకారమే)ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు ఐనా ఆహార దాన్యాలు ఉచితంగా ఇవ్వడం తప్పే.కొన్ని కోట్ల కుటుంబాలు పస్తులతో,అర్ధాకలితో అలమటిస్తున్నారు .ఐనా ఆహార దాన్యాలు ఉచితంగా ఇవ్వటం తప్పే.కోట్లాది మంది బాలల బాల్యం సరైన పోషకాహారం లేక నిర్వీర్యం అవుతుంది.ఐనా ఆహార దాన్యాలు ఉచితంగా ఇవ్వడం తప్పే.

మన ప్రదాని గారు ఎంతటి ఉదార్థ హృదయులో ఆహార దాన్యాలను సబ్సిడిలో పేదలకు అందించడానికి విధానాలు రుపొందిస్తారంట.ఎంత ఉదారత .గోదాముల్లో ఆహార దాన్యాలు వృదాగా మగ్గిపోతున్న విషయం భయటపడి పది నేలలు దాటి పోయింది.విదానాలు తయారి నిర్ణయం తీసుకోటానికే పది నెలలు పడితే.తయారు చేసేదేప్పుడు,ఆమోదం పొందేదేప్పుడు, ఇక అవి అమలయ్యేదేప్పుడు.ఈ లోపున ఆ ధాన్యాలు కాస్తా ముట్టుకోడానికి కూడా పనికి రాకుండా పోతాయి.ఇక అప్పుడు మీ విదానాలు ఏం చేస్తాయి.

6, సెప్టెంబర్ 2010, సోమవారం

రాష్ట్రంలో 1947 విభజననాటి పరిస్థితులు రాబోతున్నాయా.

రాష్ట్రం లోని పరిస్థితి చూస్తుంటే 1947 బారత్-పాక్ విభజననాటి పరిస్థితులు తలెత్తబోతున్నయా అని సందేహం కలుగుతుంది.1947 ఆగస్టులో స్వాతంత్రంతోపాటు మత ప్రాతిపదికన పాకిస్తాన్ విభజన కూడా జరిగింది.ఆ సమయంలో అత్యంత విషాదకరమైన మత ఘర్షణలు జరిగాయి.అప్పుడు జరిగిన మారణహొమంలో పాకిస్తాన్లోని హిందువులు,అలాగే భారత్ లోని ముస్లింలు వేలాదిగా చంపబడ్డారు. రైళ్లలో దేశం వదిలి వలస వెళ్తున్న వారిని కూడా వేటాడి దారుణంగా నరికి చంపారు.చివరి మహాత్ముడు ఆమరణ దీక్ష చేసేవరకు ఈ అల్లర్లు ఆగలేదు. ఆఖరికి ఆ కారణంగానే మహాత్ముడు హత్యకు గురయినారు.


ఇక రాష్ట్రంలోని పరిస్థితులలోకి వస్తే నిన్న ఒక టీవీ చానల్ లో విన్న వాఖ్యలు:-


"కూకట్ పల్లి నుండి వనస్థలిపురం పురం వరకు ఉన్న మీ వాళ్ళను తరిమి తరిమి కొడతాం"(ఒక O.U విద్యార్ది నాయకుడు)


"అక్కడ మీరు ఎక్కువ మాట్లాడితే ఇక్కడ ఉన్న మీ వాళ్ళ ఒళ్ళు పగుల్తాది"( ఒక మాజీ M.L.A)


"కొట్టడం మీకే కాదు మాకూ వచ్చు" (ఒక JAC నాయకుడు)



రాష్ట్రం ప్రశాంతంగా స్నేహబావంతో విడిపోయే పరిస్థితి ఎప్పుడో చేజారిపోయింది. నాయకుల పుణ్యమా అని ఇరుప్రాంతాల ప్రజల మధ్య పరస్పర విద్వేష భావాలు నెలకొని ఉన్నాయి.1947 అల్లర్లలో ఆవేశంలో ఉన్న ప్రజలను శాంతింపజేయడానికి నాయకులు శతవిధాల ప్రయత్నిస్తే నేటి మన రాజకీయ నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలలో ,విద్యార్ధులలో విద్వేష భావాలను కలగజేస్తున్నారు.ఆ విద్వేషం కట్టలు తెంచుకుని అల్లర్లు మొదలైతే ఆపటం ఏ రాజకీయ నాయకుడి వళ్ళా కాదనేది అక్షర సత్యం .ఆ అల్లర్లలో మనం ఉహించనుకుడాలేని ప్రాణ,ఆస్తి నష్టాలు జరిగే అవకాశం ఉంది.ఇదే విషయం గురించి భయపడుతున్నారు తెలంగాణాలోని ఆంద్రావారు,ఆంధ్రలో కొద్దో గొప్పో ఉన్న తెలంగాణా వారు.వీరికి భరోసా ఇచ్చేదేవరు ,రక్షణ కల్పించేదేవరు.సమైక్యంగా ఉన్నప్పుడే జరుగుతున్న అల్లర్లను,గొడవలను అరికట్టలేక పోతున్న ప్రభుత్వం విభజనలో అల్లర్లు జరిగితే ఏ మాత్రం అరికట్టగలదో ప్రశ్నార్ధకమే.ఇరుప్రాంతాలమద్య రాకపోకలు స్తంభించి పోవచ్చు.ఇరు ప్రాంతాల సరిహద్దులు ఇండియా-పాకిస్తాన్ ను తలపించినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.


నేను రాష్ట్ర విభజనకు వ్యతిరేకినికాను.విభజన జరిగే పక్షంలో ఇరు ప్రాంతాల వారు ఎటువంటి విద్వేష భావాలు లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో విడిపోతే ఎవరికి ఏసమస్యా ఉండదు.కాని ఈ విధంగా విద్వేషాలతో,ఆవేశాలతో విభజన జరిగితే తరువాత పరిస్థితుల గురించే నా భయమంతా.ఇరు ప్రాంతాల రాజకీయ నాయకులు ప్రజలలో ఆవేశాలు తగ్గించి పరస్పర స్నేహభావం కలగజేసి ,విభజన స్నేహపూరిత వాతావరణంలో జరిగేవిధంగా కృషి చేయాలి.ఇకనైనా మన రాజకీయ నాయకులు ఆ విధంగా ప్రయత్నిస్తారని ఆశిద్దాం.(బహుశా ఇది కొంచెం అత్యాశే అవుతుందేమో).