9, సెప్టెంబర్ 2010, గురువారం

"కుల" గణన......!

గత కొద్ది నెలలుగా కుల గణన జరపాలా వద్దా అని జరుగుతున్న వాదనలకు తెరపడింది.కేంద్ర మంత్రి వర్గం కులాల వారీగా జన గణనకు ఆమోదం తెలిపింది.దీని ద్వారా 2011 లో జరగబోతున్న జనాబా గణనలో కులాన్ని కూడా చేర్చబోతున్నారు.1931 లో దేశంలో కుల గణన జరిగింది .ఎనబైఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది.దీని ద్వారా దేశంలోని ఆరువేల కులాలు అరవైఐదు వేల ఉపకులాలు సాధికారంగా పరిగణలోకి వస్తాయి.


ఇప్పుడిప్పుడే కులగజ్జి నుండి బయటపడుతున్న ప్రజలకి బాబు నీ కులం ఇది మర్చిపోకు అని గుర్తుచేయబోతున్నాయి ఈ లెక్కలు.నెమ్మదిగా వ్యాపిస్తున్న ప్రాంతీయతత్వం,మతతత్వాలకు తోడుగా మెల్లగా చాపకింద నీరులా కులతత్వాన్ని కూడా చేరుస్తున్నారు మన నాయకులు.appsc లాంటి సంస్థల్లో ప్రాంతాల వారీగా రిజర్వేషన్ల కోసం జరుతున్న ఉద్యమాలు.ఇక నుండి "మా కులం జనాభా ఇంతమంది ఉన్నా ఉన్న ఉద్యోగాలు కొన్నే కాబట్టి upsc ,appsc లాంటి సంస్టలలో మా కులానికి రిజర్వేషను కావాలని" అరవై ఐదు వేల కులాల వారు ఉద్యమాలు నడపబోతున్నారు.మన రాజకీయ నాయకులకు మాత్రం ఇది ఎంతో ఉపయోగకరం."విభజించి పాలించు" అనే బ్రిటీషు వారి సూత్రాన్ని వంటబట్టించుకున్న మన నాయకులకు ముఖ్యంగా అత్యంత హేయమైన కుల రాజకీయాలకు ఆదర్శాలుగా ఉన్న ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్,మాయావతి లాంటి వారికి ఎంతో అవసరం.ఇక ఇంకో విషయం .జనాబా గణనలో వారు చెప్పేవాటి విశ్వసనీయత నిర్ణయించాల్సిన బాద్యత ఎన్యుమరేటర్లదేనట అవి ఎంత హేతుబద్దంగా ఉంటాయో అనుమానమే.తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి జరిమానా వెయ్యి రూపాయలట.ఇకనుండి తప్పు కులంతో ఎన్నికలలో పోటి చేసిన నాయకుల,ఉద్యోగాలలో చేరిన వారి కేసులు లక్షల్లో కోర్టుల్లోకి రాబోతున్నాయి.అంటే తప్పుడు కులం తో ఉద్యోగం లో చేరి పది,పదిహేను తర్వాత ఆ విషయం బయట పడితే కోర్టులో వెయ్యి రూపాయలు జరిమానా కట్టి దర్జాగా తిరగోచ్చన్నమాట.

దేశంలోని మేధావులంతా వద్దుమోర్రో అని గగ్గోలు పెడుతున్నా కుల గణనని ఆమోదిచడం ద్వారా మన దేశంలో తమ పబ్బం గడుపుకోవటానికి రాజకీయ నాయకులు ఎంతకైనా దిగాజారుతారని మరోసారి రుజువు చేసుకున్నారు.

1 కామెంట్‌:

  1. prajalu yippuidippude kula gazzi nunchi bayata padutunnara ? gatamlo yeppudu lenata kula gazzi prajallo yippudu perigindi . agravarna kula gazzi gala variki mayavati, lalu prasad yadav lone kula gazzi kani pistundi.kula gazzi antata undi

    రిప్లయితొలగించండి