6, సెప్టెంబర్ 2010, సోమవారం

రాష్ట్రంలో 1947 విభజననాటి పరిస్థితులు రాబోతున్నాయా.

రాష్ట్రం లోని పరిస్థితి చూస్తుంటే 1947 బారత్-పాక్ విభజననాటి పరిస్థితులు తలెత్తబోతున్నయా అని సందేహం కలుగుతుంది.1947 ఆగస్టులో స్వాతంత్రంతోపాటు మత ప్రాతిపదికన పాకిస్తాన్ విభజన కూడా జరిగింది.ఆ సమయంలో అత్యంత విషాదకరమైన మత ఘర్షణలు జరిగాయి.అప్పుడు జరిగిన మారణహొమంలో పాకిస్తాన్లోని హిందువులు,అలాగే భారత్ లోని ముస్లింలు వేలాదిగా చంపబడ్డారు. రైళ్లలో దేశం వదిలి వలస వెళ్తున్న వారిని కూడా వేటాడి దారుణంగా నరికి చంపారు.చివరి మహాత్ముడు ఆమరణ దీక్ష చేసేవరకు ఈ అల్లర్లు ఆగలేదు. ఆఖరికి ఆ కారణంగానే మహాత్ముడు హత్యకు గురయినారు.


ఇక రాష్ట్రంలోని పరిస్థితులలోకి వస్తే నిన్న ఒక టీవీ చానల్ లో విన్న వాఖ్యలు:-


"కూకట్ పల్లి నుండి వనస్థలిపురం పురం వరకు ఉన్న మీ వాళ్ళను తరిమి తరిమి కొడతాం"(ఒక O.U విద్యార్ది నాయకుడు)


"అక్కడ మీరు ఎక్కువ మాట్లాడితే ఇక్కడ ఉన్న మీ వాళ్ళ ఒళ్ళు పగుల్తాది"( ఒక మాజీ M.L.A)


"కొట్టడం మీకే కాదు మాకూ వచ్చు" (ఒక JAC నాయకుడు)



రాష్ట్రం ప్రశాంతంగా స్నేహబావంతో విడిపోయే పరిస్థితి ఎప్పుడో చేజారిపోయింది. నాయకుల పుణ్యమా అని ఇరుప్రాంతాల ప్రజల మధ్య పరస్పర విద్వేష భావాలు నెలకొని ఉన్నాయి.1947 అల్లర్లలో ఆవేశంలో ఉన్న ప్రజలను శాంతింపజేయడానికి నాయకులు శతవిధాల ప్రయత్నిస్తే నేటి మన రాజకీయ నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలలో ,విద్యార్ధులలో విద్వేష భావాలను కలగజేస్తున్నారు.ఆ విద్వేషం కట్టలు తెంచుకుని అల్లర్లు మొదలైతే ఆపటం ఏ రాజకీయ నాయకుడి వళ్ళా కాదనేది అక్షర సత్యం .ఆ అల్లర్లలో మనం ఉహించనుకుడాలేని ప్రాణ,ఆస్తి నష్టాలు జరిగే అవకాశం ఉంది.ఇదే విషయం గురించి భయపడుతున్నారు తెలంగాణాలోని ఆంద్రావారు,ఆంధ్రలో కొద్దో గొప్పో ఉన్న తెలంగాణా వారు.వీరికి భరోసా ఇచ్చేదేవరు ,రక్షణ కల్పించేదేవరు.సమైక్యంగా ఉన్నప్పుడే జరుగుతున్న అల్లర్లను,గొడవలను అరికట్టలేక పోతున్న ప్రభుత్వం విభజనలో అల్లర్లు జరిగితే ఏ మాత్రం అరికట్టగలదో ప్రశ్నార్ధకమే.ఇరుప్రాంతాలమద్య రాకపోకలు స్తంభించి పోవచ్చు.ఇరు ప్రాంతాల సరిహద్దులు ఇండియా-పాకిస్తాన్ ను తలపించినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.


నేను రాష్ట్ర విభజనకు వ్యతిరేకినికాను.విభజన జరిగే పక్షంలో ఇరు ప్రాంతాల వారు ఎటువంటి విద్వేష భావాలు లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో విడిపోతే ఎవరికి ఏసమస్యా ఉండదు.కాని ఈ విధంగా విద్వేషాలతో,ఆవేశాలతో విభజన జరిగితే తరువాత పరిస్థితుల గురించే నా భయమంతా.ఇరు ప్రాంతాల రాజకీయ నాయకులు ప్రజలలో ఆవేశాలు తగ్గించి పరస్పర స్నేహభావం కలగజేసి ,విభజన స్నేహపూరిత వాతావరణంలో జరిగేవిధంగా కృషి చేయాలి.ఇకనైనా మన రాజకీయ నాయకులు ఆ విధంగా ప్రయత్నిస్తారని ఆశిద్దాం.(బహుశా ఇది కొంచెం అత్యాశే అవుతుందేమో).

14 కామెంట్‌లు:

  1. ధన్యవాదాలు. పరిస్తితులను చాలా చక్కగా వివరించారు.ఇప్పటికైనా మన పాలకులు నాయకులు కళ్ళు తెరుస్తారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. mana raajakeeya naayakulameeda naakemi nammakam ledu.ika raastam sangati devude chusukovaali

    రిప్లయితొలగించండి
  3. ఇప్పటికే ఎంతో మంది విద్యార్దులు,ప్రజలు చనిపోయారు.ఇక జరగబోయే వాటి గురిచి ఆలోచిచాలంటేనే భయంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. asalidanta andhra mla la raajeenaamalotone wachhindi.appude maa telangana makiste ee lolli undaka potunde gada.chesina daaniki anubhavinchaka tappadu.

    రిప్లయితొలగించండి
  5. @అజ్ఞాత : ఇక్కడి పరిస్థితులు చూసి దేవుడు కూడా పారిపోతాడేమో.

    రిప్లయితొలగించండి
  6. @శ్రీకాంత్:ఈ రాజకీయ నాయకుల ఆటలో సామాన్య ప్రజలు పావులుగా మారుతున్నారు.





    @అజ్ఞాత: తప్పు చేసేది ఒకరు శిక్షింపబడేది ఇంకొకరు ఇదేం న్యాయం .ఇరుప్రాంతాలలో రాజకీయ నాయకులు చేసిన తప్పుకి ప్రజలు ప్రాణాలు కోల్పోవాలా.

    రిప్లయితొలగించండి
  7. edi imaina vidipote telangaana prajalake nastam ani teliya cheppalsindiga social movement undaali.

    రిప్లయితొలగించండి
  8. hmm telangana vastey kada .. vibhajanalu jarigedi ..

    okavela vachina appudu cinema anta verey untadi ley ...!!!

    రిప్లయితొలగించండి
  9. ఆ సినిమా గురించే కదా చెప్పేది.

    రిప్లయితొలగించండి
  10. get llllllllllllllllllllllllllllllllllllooooooooooooooooosssssssssssssttttttttttttttttttt

    రిప్లయితొలగించండి