8, సెప్టెంబర్ 2010, బుధవారం

శ్రీ కృష్ణ కమిటీ ఏంచెప్పబోతుంది........!

శ్రీకృష్ణ కమిటీ సభ్యకార్యదర్శి దుగ్గల్‌ గారు నిన్న విలేకరులతో మాట్లాడుతూ." ప్రజలకు ఏది ఉపయోగం, ఏది హేతుబద్ధం, అత్యధిక ప్రజావాంఛ ఏమిటి, ప్రజాప్రయోజనాలకు ఏది ముఖ్యం అన్న విషయాలు మా నివేదికలో పొందుపరుస్తాం. కార్యాచరణ 'ఎ' అవసరమైతే ఎలా ఉండాలి, కార్యాచరణ 'బి' అయితే ఎలా ఉండాలో చెబుతాం. నిర్ణయాధికారం మాత్రం ప్రభుత్వానిదే"అని అన్నారు .దీనిని భట్టి శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఏవిధంగా ఉండబోతుందో మనం ఉహించవచ్చు..


ఒకవేళ వారు అన్నట్టు కార్యాచరణ 'ఎ' అంటే విభజన జరిగే పక్షం లో .ఆంద్రా ప్రాంతం వారు ముఖ్యం గా ఆందోళన చెందుతున్న రాజదాని హైదరాబాద్ గురించి నీటి పంపిణి గురించి సూచనలు చేయొచ్చు.అవి ఒకటి హైదరాబాదును కేంద్రపాలిత౦గా చేయటం.రెండు హైదరాబాదును ఉమ్మడి రాజదానిగా చేయటం. మూడు ఆంధ్రా వారు కొత్త రాజదానిని ఏర్పరుచుకోవటానికి తగిన నిధులు కేంద్రం సమకూర్చాలని సలహా ఇవ్వటం.ఇక నీటి వనరుల పంపిణీ విషయంలో ఇరు ప్రాంతాల వారి మధ్య ఒక ఒప్పందం తయారు చేయొచ్చు.


ఇక కార్యాచరణ 'బి' అంటే విభజన జరగని పక్షంలో .ఈ సూచనలు చేయొచ్చు.ప్రత్యేక మండలి ఏర్పరచి తెలంగాణా అభివృద్దికి నిధులు కేటాయించటం.తెలంగాణా వారికి రాజకీయ పదవుల పంపిణి.ఇంతకు ముందు ఉన్న" పెద్దమనుషుల ఒప్పందం" తరహాలో మరొక ఒప్పందాన్ని ఏర్పాటు చేసి.దాన్ని కచ్చితంగా అమలు పరిచే విదంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పరిచి దానికి చట్టభద్రత కల్పించటం ఈ విధంగా ఉండవచ్చు .కాని ఇంతకూ ముందు జరిగిన పెద్దమనుషుల ఒప్పందంలోనే మోసపోయామని భావిస్తున్న తెలంగాణా ప్రాంతం వారిని రాజదాని విషయంలో పట్టు పడుతున్న ఆంధ్రా ప్రాంతం వారిని ఎలా ఒప్పించగలరనేది ప్రశ్నార్ధకమే.నివేదిక అందిన తరువాత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది కత్తి మీద సాము లాంటిదే.

2 కామెంట్‌లు: